రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు
- July 21, 2021
న్యూఢిల్లీ: నేడు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ప్రేమ, త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటామని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బక్రీద్ జరుపుకోవాలని సూచించారు.
‘ప్రేమ, సహనం, త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.పేదలతో, బంధువులతో ఆహారాన్ని పంచుకునే ఈ పండుగ, మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయాలనే సందేశాన్నిస్తుంది.ఈ సందర్భంగా శాంతి, సహనం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఈ పర్వదినం భక్తికి, విశ్వాసానికి సంకేతమని మోడీ అన్నారు. ఈ పండుగ సోదరభావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







