జాబ్‌ మేళాలో 26 కంపెనీలు

- March 10, 2016 , by Maagulf
జాబ్‌ మేళాలో 26 కంపెనీలు

కుత్బుల్లాపూర్‌ మండలం దుండిగల్‌ గ్రా మంలోని ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలో బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీఏ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 11, 12న '1000 జాబ్‌ మేళా' నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిప ల్‌ కె.వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో 26 కంపెనీలు పాల్గొంటున్నాయని, తెలంగాలో మొదటిసారిగా ఈ 1000 జాబ్‌ మేళా ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలో నిర్వహిస్తున్నామని, ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఈ ఉద్యోగ మేళాలో పా ల్గొని ఉద్యోగం పొందాలని ఆయన కోరారు. ఈ ఉద్యోగ మేళా ను బీఎన్‌ శ్రీనివాస్‌, కేవీ సురే్‌షకుమార్‌, వి.వంశీకృష్ణ, బి.శివరాంకృష్ణ, ఎం.పల్లవి, విజయ్‌కుమార్‌ కోఆర్డినేటర్లు వ్యహరిస్తారని వెంకటేశ్వర్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com