అమెరికా లో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు బంపర్ ఆఫర్

- March 10, 2016 , by Maagulf
అమెరికా లో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు బంపర్ ఆఫర్

అమెరికా వెళ్లి చదువు కోవాలని, అక్కడే మంచి జాబ్ చేయాలనీ చాల మందికి ఉంటుంది..అయితే అలాంటివారికి గుడ్ న్యూస్ తెలిపింది అమెరికా ప్రభుత్వం. తాజాగా తన విదేశాంగ విధానంలో భారీ మార్పులు చేయబోతోంది. కేవలం మనదేశం నుండే కాక ప్రపంచ దేశాల నుంచి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఇప్పటి వరకూ విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తి చేసుకున్న తర్వాత 7 నెలల నుంచి ఏడాది పాటు మాత్రమే అమెరికాలో ఉండి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పేరిట తాత్కాలిక ఉద్యోగం చేయవచ్చు. ఈ నిబంధన వాళ్ళ చాల మంది విదేశీ విద్యార్థులను ఇబ్బంది పెడుతుంటుంది. తమ దేశంలో తయారయిన మేధావులను ఉపయోగించుకోవడానికి అమెరికా రంగం సిద్ధం చేసింది.విదేశీ విద్యార్థులు ఎవరయినా సరే అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత మూడు సంవత్సరాలపాటు తాత్కాలిక ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి ఇస్తోంది. ఈ నూతన విధానాన్ని శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ విధానం మే 10 నుంచి అమలులోకి వస్తుంది. ఈ వార్త తో స్టూడెంట్స్ అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com