కువైట్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆమోదం
- July 23, 2021
కువైట్ సిటీ: కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. కోవిషీల్డ్ కువైట్‌లో కూడా ఆమోదం పొందిందని, ఈ వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రవాసులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉంటే కువైట్ వచ్చేందుకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. అయితే, వాలిడ్ రెసిడెన్సీ పర్మిట్‌తో పాటు జాబ్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండి, విదేశీయులపై విధించిన బ్యాన్ తొలిగించిన తర్వాత కువైట్ రావొచ్చని స్పష్టం చేసింది.మొదటి డోసు వ్యాక్సిన్ కు సంబంధించిన సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేసిన అధికారిక లింక్ ద్వారానే రెండో డోసుకు సంబంధించిన వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలని సూచించింది.అలాగే రెండు డోసులకు సంబంధించిన స్కాన్ కాపీలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో(FileSize: 500KB లోపు ఉండాలి) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
https://vaxcert.moh.gov.kw/SPCMS/PH/CVD_19_Vaccine_External_RegistrationModify.aspx లింక్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎంబసీ తెలిపింది. కాగా, వ్యాక్సిన్ సర్టిఫికేట్ అప్డేట్ చేసేటప్పుడు దానిపై పాస్‌పోర్టు నెంబర్ వేయడం తప్పనిసరి.దీని కోసం ప్రవాసులు.. మొదట http://cowin.gov.inలో లాగిన్ అయిన తర్వాత రైజ్ ఏ ఇష్యూను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం పాస్‌పోర్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత డ్రాప్ డౌన్ మెనుకు వెళ్లి పాస్‌పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







