క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించిన 'అఖండ'
- July 23, 2021హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులోని లొకేషన్ లో క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడులోని ఒక ఆలయంలో షూటింగ్ జరుగుతోంది. ప్రధాన నటుడితో పాటు మిగతా నటీనటులు కూడా సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సమాచారం ప్రకారం స్టంట్ కొరియోగ్రాఫర్ శివ ఒక యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్ చేసాడు. ఇది “అఖండ” చిత్రానికి ప్రధాన హైలైట్ అని అంటున్నారు.
కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్న “అఖండ”ను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో బాలయ్య అఘోరాగా కన్పించడంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. “అఖండ”కు తమన్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..