టోక్యో ఒలింపిక్స్: యూఏఈ బృందానికి స్విమ్మర్ యూసుఫ్ అల్ మాత్రూషి లీడ్
- July 24, 2021
యూఏఈ: ఆకట్టుకునే అథ్లెట్ల విన్యాసాలు, అబ్బురపరిచే ప్రదర్శనలకు వేదికైన ఒలింపిక్స్ సందడి మొదలైంది. ఆకాశం మిరుమిట్లు గొలిపే బాణాసంచాతో ఒలింపిక్స్ 2020కి ఘనంగా స్వాగతం పలికింది టోక్యో. జపాన్ టాప్ టెన్నిస్ ప్లేయర్ ఒసాకా ఒలింపిక్స్ జ్యోతిని వెలిగించి మెగా ఈవెంట్ ను ప్రారంభించగా...ఒలింపిక్స్ లో పాల్గొంటున్న దేశాలన్ని తమ బృందాలతో కవాతు నిర్వహించాయి. యూఈఏ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న అథ్లెట్ల బృందానికి స్విమ్మర్ యూసుఫ్ అల్ మాత్రూషి నాయకత్వం వహించాడు. ఆరంభ వేడుకల్లో యూఏఈ జాతీయ పతాకంతో మాత్రూషి ముందు నడవగా యూఏఈ అథ్లెట్ల బృందం అతన్ని అనుసరించింది. టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలో జపాన్‌లోని యూఏఈ రాయబారి షెహాబ్ అహ్మద్ అల్ ఫాహిమ్, అడ్మినిస్ట్రేటీవ్& ఆర్థిక వ్యవహారాల జాతీయ ఒలింపిక్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ
జనరల్ అజ్జా బింట్ సులేమాన్ పాల్గొన్నారు.
యూఏఈ అథ్లెట్ల బృందం కవాతుకు నాయకత్వం వహించిన యూసుఫ్ అల్ మాత్రూషి తొలిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొంటున్నాడు. అతను 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్లో యూఏఈకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే..ఒలింపిక్స్ యూఏఈ పతకాల వేట ఈ నెల 25 నుంచి షురూ కాబోతోంది. 25న షూటర్ సైఫ్ బిన్ ఫుట్టాయిస్... స్కీట్ షూటింగ్ లో పోటీపడుతున్నాడు. ఫుట్టాయిస్ రెండుసార్లు ISSF ప్రపంచ కప్ పతక విజేతగా నిలిచాడు. 2016 రియో క్రీడలలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఈ షూటర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఒలింపిక్ ఫుట్టాయిస్ పతకం సాధించటం ఖాయమనే ధీమా వ్యక్తం అవుతోంది.
సమ్మర్ గేమ్స్‌లో యుఎఇ యొక్క ఉత్తమ ప్రదర్శన 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ హషర్ అల్ మక్తూమ్ షూటింగ్లో జరిగిన డబుల్ ట్రాప్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించాడు.
ఇదిలాఉంటే జూడోకాస్ విక్టర్ స్క్వోర్టోవ్, ఇవాన్ రెమారెంకోపై కూడా యూఏఈ ఒలింపిక్స్ కమిటీ ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. టోక్యోలోని జూడో మ్యాట్ మీద
ఈ ఇద్దరు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారనే ధీమాతో ఉంది. 2014 ప్రపంచ జూడో ఛాంపియన్‌షిప్స్‌లో, జకార్తాలో 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత అయిన
స్క్వోర్టోవ్ జూలై 26న 73 కిలోల విభాగంలో పోటీపడుతుండగా...2014 ప్రపంచ జూడో ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత రెమరెంకో జూలై 30న 100 కిలోల ఓవర్ ఈవెంట్లో పోటీపడతారు. అలాగే ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలో జూలై 31 న జరిగే 100 మీటర్ల ఈవెంట్లో యూఏఈ స్పింట్ స్టార్ హసన్ అల్ నౌబీ మెడల్ వేట షురూ చేయనున్నాడు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







