పోలీసులపై దాడి..నలుగురు సోదరుల అరెస్ట్
- July 24, 2021
కువైట్: పోయి పోయి పోలీసులతోనే పెట్టుకొని జైలు పాలయ్యారు నలుగురు సోదరులు. కువైట్లోని అబ్దుల్లా ముబారక్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువుల మధ్య మొదలైన చిన్న గొడవ చిలికి చిలికి పెద్ద దుమారం రేపింది. మాట మాట పెరిగి గొడవ పెద్దదవటంతో బంధువుల్లో కొందరు పోలీస్ కంట్రోల్ రూం ఫోన్ చేసి అత్యవసరంగా రావాల్సిందిగా కోరారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే..పోలీసులు వచ్చిన తర్వాత కూడా గొడవ సద్దుమణగలేదు. పైగా పోలీసులపైనే దాడికి తెగబడ్డారు నలుగురు అన్నదమ్ములు. దీంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాల్పుల అనంతరం తమపై దాడికి పాల్పడిన ఆ నలుగురు సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







