భారత్ కు సంఘీభావం ప్రకటించిన బహ్రెయిన్
- July 24, 2021
మనామా: కుండపోత వర్షాలు భారత్ లోని పలు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. రెండు రోజుల్లోనే 129 మంది మరణించారు. రాయ్ గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 38 మంది మృతి చెందారు.పలు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంటలు నీటిపాలయ్యాయి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ కు బాసటగా నిలుస్తామని ప్రకటించింది బహ్రెయిన్. ఈ మేరకు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. తమకు చిరకాల మిత్ర దేశమైన భారత్ ఈ ప్రకృతి విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. కుండపోత వర్షాలు, వరదల జరిగిన నష్టానికి సానుభూతి వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







