కోవిడ్ రూల్ బ్రేక్..379 మందిపై చట్టపరమైన చ‌ర్య‌లు

- July 24, 2021 , by Maagulf
కోవిడ్ రూల్ బ్రేక్..379 మందిపై చట్టపరమైన చ‌ర్య‌లు

దోహా: కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన  వారిని ఉపేక్షించేది లేద‌ని ఖ‌తార్ అధికారులు మ‌రోసారి హెచ్చ‌రించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కపోవ‌టం అంటే చ‌ట్ట‌విరుద్ధ చ‌ర్య‌ల‌కు ప‌ల్ప‌డుతున్న‌ట్లేన‌ని స్ప‌ష్టం చేసింది. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో కేసులు న‌మోదు చేసిన ఖ‌తార్ అధికారులు...తాజాగా మ‌రో 379 మందిపై చ‌ర్య‌లు తీసుకుంది. ఇందులో 318 మంది ఫేస్ మాస్క్ ధ‌రించ‌లేద‌ని, మ‌రో 57 మంది భౌతిక దూరం పాటించ‌లేద‌ని వెల్ల‌డించారు. అలాగే ఎతెరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోని నలుగురు ఉన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని వాళ్లందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వేల కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com