వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణి చేసిన వివేకానంద చైతన్య టీం
- July 24, 2021
తెలంగాణ: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలో నాగాలయం దగ్గర ఉన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబాలు, నిన్నటి వర్షాలకు వారికి చెందిన ఇళ్ళు వర్షంకు కొట్టుకుపోయాయి.ఆ కుటుంబాలకు భోజనం ఇబ్బందులు అవుతుందని వేంపల్లి గ్రామ వాసులు దుబాయ్ లో నివసిస్తున్న పెనుకుల అశోక్ కి తెలుపగా వెంటనే వివేకానంద చైతన్య టీం ద్వారా నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేసారు.

పెనుకుల అశోక్ మాట్లాడుతూ...ఎవరన్నా ఇబ్బందులలో ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని కోరారు.అలాగే ప్రభుత్వం ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు సాయం చేసి వారికి ఇళ్లు కూడా కట్టించాలని విజ్ఞప్తి చేశారు.

నిత్యావసర సరుకులు పంపిణి చేసిన వారిలో కొత్తపేట సర్పంచ్ మహేష్,వెల్మల నరేష్,నిగ రాజేష్,వెల్మల రాజశేఖర్, శ్రీధర్ యాదవ్,కాటుకం మహేష్, అచ్చూత్, అరుణ్, మోహన్రాజ్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







