ఇంటివద్ద ఉండటానికి అయిష్టత చూపుతున్న పాఠశాల పిల్లలు

- March 11, 2016 , by Maagulf
ఇంటివద్ద ఉండటానికి అయిష్టత చూపుతున్న పాఠశాల పిల్లలు

గతంలో బడికి డుమ్మా కొట్టడం ఎలా అనే విషయం మీద పిల్లలు రక రకాల కధలు చెప్పి స్కూల్ ఎగ్గోట్టేవారు. ఇపుడు ఒక రోజు సెలవను కూడా ఇంటి వద్ద గడపటానికి ఆసక్తి చూపడం లేదు. వరదల కారణంగా వచ్చిన సెలవులు పాఠశాల విద్యార్ధులకు -సంతోషం కల్గించడం లేదు. ఇంటి వద్ద వీరు ఉండటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. " 8 వ తరగతి చదువుతున్న నా కుమారుడు పాఠశాలలో సాహిత్య తరగతులను ఈ సెలవు కారణంగా కోల్పోవడంపై కలత చెండుతున్నాడని ఒక తండ్రి పేర్కొంటున్నాడు "  తన అనుభవంలో... పాఠశాలకు వెళ్ళకపోవడమే ఆనందమని...కానీ , పాఠశాల వెళ్లనందుకు దిగులు పడటం తనకు ఎంతో విచిత్రంగా ఉందని తెలిపాడు.   అలాగే బ్రిటిష్  పాఠశాలలో చదువుకొంటున్న 6 ఏళ్ళ విద్యార్ధి ' ఈ రోజు తమ పాఠశాల ఎందుకు  సెలవని తన తల్లితండ్రులను నిలదీశాడు..తమ బడిలో దుస్తుల ప్రదర్శన కార్యక్రమం ఉందని చెబ్తూ, రిహార్సిల్ లో సరిగా పాల్గొనకపోతే బహుమతి ఏ విధంగా వస్తుందని ? ఈత శిక్షణా శిభిరంలోను ఉన్నానని కనుక  పాఠశాల త్వరగా తెరవాలని గగ్గోలు పెడుతున్నాడు.  ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించడానికి ఒక రోజు  సెలవు పెట్టాల్సివచ్చింది   గురువారం నుంచి వార్షిక పరీక్షలు జరపాల్సిన పాఠశాలలు, ఆదివారంకు వాటిని  వాయిదా వేసింది.   ,  భారత బోర్డులు నిర్వహించే  సీబీఎస్ఈ పరీక్షలకు తేదీను మార్చలేదు, కుండపోత వర్షం కారణంగా  బుధవారం, గురువారం  విద్య మంత్రిత్వ శాఖ  యుఎఇ లో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com