APNRTS ఖతార్ వారి సహకారంతో స్వస్థలం చేరిన ప్రవాసాంధ్ర మహిళలు
- July 26, 2021
కడప: APNRTS డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్ తెలిపిన వివరాల ప్రకారం 2020 సంవత్సరంలో వై.యస్.ఆర్.జిల్లా అక్కయ్యపల్లికి చెందిన కాకిరేని గంగాదేవి,ఈస్ట్ గోదావరి జిల్లా కోటనండూరు మండలానికి చెందిన గంగాభవాని స్పాన్సర్ ద్వారా గృహ కార్మికులుగా (ఇంటిపని) ఖతార్ కు వెళ్ళారు.
అయితే కొన్ని నెలల తర్వాత స్పాన్సర్ ఇబ్బందులు భరించలేక ఇండియాకి పంపమని 5 నెలల నుండి అడుగుతుంటే వారి ఇద్దరిని ఇండియాకు పంపుతాను అని చెప్పి వారిపై దొంగతనం కేసు మోపి జైలుకు పంపడం జరిగింది.ఈ విషయం APNRTS కో-ఆర్డినేటర్ మరియు ఖతార్ తెలుగు కళా సమితి జాయింట్ జనరల్ సెక్రటరీ మనీష్ కి దృష్టికి వచ్చింది.వెంటనే స్పందించిన మనీష్ ఖతార్ జ్యూడిషియల్ లో స్పాన్సర్ కావాలనే గంగాదేవి మరియు గంగాభవానిలపై అన్యాయంగా దొంగతనం కేసు పెట్టాడని,వారిని ఇండియాకు పంపాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.దీంతో ఖతార్ జ్యూడిషియల్ వారు ఆ అభాగ్యులు ఇద్దరినీ విచారించి,నిర్దోషులుగా గుర్తించి స్వదేశానికి పంపమని ప్రభుత్వానికి తెలియజేశారు.
వెంటనే మనీష్ ICBF MC సభ్యురాలు మరియు ఖతార్ APNRTS కో-ఆర్డినేటర్ రజనీ మూర్తి సహకారంతో ఇండియన్ ఎంబసీ వారితో మాట్లాడి వారికి తాత్కాలిక పాస్‌పోర్ట్ మరియు టికెట్ ఇప్పించడము జరిగింది.అంతేకాకుండా హైదరాబాద్ విమానాశ్రయము నుండి వారి స్వస్థలాలకు వెళ్ళేందుకు దారి ఖర్చులకు ఖతార్ తెలుగు కళా సమితి సోషల్ సెక్రెటరీ శ్రీమతి దుర్గాభవాని ఆర్ధిక సహాయం అందించటం జరిగింది.బాధితులు కాకిరేని గంగాదేవి, గంగాభవాని 24 జులై 2021 న ఖతార్ లో బయలుదేరి 25 జులై 2021 న హైదరాబాద్ చేరుకోవడం జరిగింది.
ఈ సందర్భముగా APNRTS డైరెక్టర్ ఇలియాస్ మాట్లాడుతూ...ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల కోసం పనిచేస్తోందని అన్నారు.వివిధ దేశాలలో APNRTS కో-ఆర్డినేటర్స్ ను నియమించామని,ప్రవాసాంధ్రుల సమస్యలు పరిష్కరించేందుకు APNRTS మరియు కో-ఆర్దినేటర్స్ నెట్ వర్క్ అనునిత్యం పనిచేస్తుందని తెలిపారు.ప్రవాసాంధ్రులకు ఎటువంటి సమస్యలు ఉన్న APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్స్ 8500027678,08632340678 సంప్రదించవచ్చన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మరియు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తరపున మనీష్ మరియు రజని మూర్తి ను అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలిపారు.
కాకిరేని గంగాదేవి, గంగాభవాని మాట్లాడుతూ...APNRTS ద్వారా మాలాంటి బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రికి, APNRTS అధ్యక్షులకు, మమ్మల్ని ఖతార్ లో ఆదుకున్న మనీష్,రజనీ,దుర్గాభవాని కి కృతజ్ఞతలు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







