ట్యునీషియా: దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
- July 26, 2021
ట్యునీషియా: దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుడంతో.. పార్లమెంటు వెలుపల బారికేడ్లతో పాటు భారీ బలగాలను మోహరించారు. పార్లమెంట్ స్పీకర్, ఎన్నాథా పార్టీ నేత రాచ్‌ఘన్నైచిలను సోమవారం పార్లమెంట్‌లోకి ప్రవేశించకుండా నిరసనకారులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున వీధుల్లో చేపడుతున్న నిరసన ప్రదర్శనలు..కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారాయి.కరోనా సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని,ఆర్థిక సంక్షోభం నెలకొందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్లమెంటును రద్దు చేయడంతో పాటు టునిషియా ప్రధాని హిచెమ్ మిచిచిని అధ్యక్షుడు తొలగించిన సంగతి తెలిసిందే. కాగా, పార్లమెంట్ నిరంతరం సమావేశాలు జరుపుతుండగా..అధ్యక్షుడు సయీద్ పార్లమెంట్ రద్దు చేయడం చెల్లదని..ఆయన నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు ఎన్నాథా పార్టీ పేర్కొంది.ప్రస్తుతం టునీషియాలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు టర్కీ విదేశాంగమంత్రి పేర్కొన్నారు.ప్రజాస్వామ్య ప్రభుత్వ పునరుద్ధరణ జరగాలని పిలుపునిచ్చారు. అలాగే జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా అడ్బెహర్ మాట్లాడుతూ.. ట్యునీషియాలో పరిస్థితులు వీలైనంత త్వరగా సాధారణ స్థితికి చేరుకోవాలని జర్మనీ ఆశిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







