మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు

- March 11, 2016 , by Maagulf
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు

 మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో కుంట పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న పోలీసులే లక్ష్యంగా చేసుకుని ల్యాండ్ మైన్ పెట్టి పేలుడు కు పాల్పడ్డారు. రెండు వారాల క్రితం జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్టు సమాచారం. ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో గాయపడిన 12 మంది పోలీసులకు చికిత్స అందిస్తున్నారు.వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఖమ్మం జిల్లా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com