రాత్రి 8 గంటల తర్వాత కూడా దుకాణాలకు గ్రీన్ సిగ్నల్
- July 27, 2021
కువైట్: కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షల్లో పలు సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. రాత్రి ఎనిమిది తర్వాత దుకాణాలు, ఇతర వాణిజ్య కేంద్రాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ప్రతి వారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిమండలి అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం కువైట్లో దుకాణాల నిర్వహణ, ఇతర వాణిజ్య లావాదేవీలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. అయితే..జనం గ్యాదర్ అయ్యే ఎలాంటి కార్యక్రమాలను అనుమతించటం లేదని వెల్లడించారు. పెళ్లిళ్లు, కాన్ఫరెన్స్, సభలు, పిల్లలతో నిర్వహించే ఈవెంట్లపై సెప్టెంబర్ వరకు ఆంక్షలు కంటిన్యూ అవుతాయి. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్నవారికి దేశవ్యాప్తంగా అనుమతితో నిర్వహించే అన్ని ఈవెంట్లకు ఎంట్రీ ఉంటుందని, అదే వ్యాక్సిన్ తీసుకోని వారికి ఫార్మసీలు, కోపరేటీవ్ సొసైటీలు, మార్కెట్లు, ఫుడ్&క్యాటరింగ్ కేంద్రాల్లోకి మాత్రమే అనుమతించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







