వ్యాక్సిన్ తీసుకోని వారికి పబ్లిక్ ప్లేసుల్లోకి నో ఎంట్రీ

- July 27, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకోని వారికి పబ్లిక్ ప్లేసుల్లోకి నో ఎంట్రీ

సౌదీ: కోవిడ్ వ్యాప్తిని పకడ్బందీగా నిర్వహించేందుకు వ్యాక్సిన్ తీసుకోవటం ఒక్కటే మార్గం. అందుకే దేశ ప్రజలు, ప్రవాసీయులు వీలైనంత ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సౌదీ ప్రభుత్వం...ఇక వ్యాక్సిన్ తీసుకోని వారికి ఆంక్షల చట్రం బిగిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోని వారు బయట తిరక్కుండా నిబంధనలు విధిస్తోంది. ఇక నుంచి టీకా తీసుకోని వ్యక్తులను ప్రభుత్వ భవనాల్లోకి అనుమతించొద్దని కింగ్డమ్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు జరిగినా టీకా తీసుకోని వారికి అనుమతి ఉండదు. చివరికి పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ లోకి కూడా అనుమతి ఉండదు. ఈ నిబంధన ఆగస్టు 1 నుండి అమలులోకి వస్తుందని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాదు..కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకుంటే..ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, వినోదం, క్రీడా కార్యక్రమాలకు హజరయ్యేందుకు అనుమతి ఉండదు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలోకి ఎంట్రీ ఉండదు. చివరికి వారు ఉద్యోగస్తులు అయినా సరే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారు తవక్కల్నా యాప్‌లో తమ వ్యాక్సినేషన్ డీటేల్స్ తప్పక చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ డీటేల్స్ చెక్ చేసిన తర్వాత ప్రభుత్వ ఆఫీసులు, ప్రజారవాణా, స్కూళ్లలోకి అనుమతినివ్వాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com