కువైట్ లో ముగ్గురు నర్సులు అరెస్ట్!

- July 27, 2021 , by Maagulf
కువైట్ లో ముగ్గురు నర్సులు అరెస్ట్!

కువైట్: డబ్బులు తీసుకుని నకిలీ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు జారీ చేసినందుకు గాను ఓ భారతీయ నర్సుతో పాటు మరో ఇద్దరు ఈజిప్ట్ నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు.తాజాగా క్రిమినల్ ఇన్విస్టిగేషన్ అధికారులు ఈ ముగ్గురిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపించారు.వ్యాక్సిన్ వేసుకోని వారి దగ్గర నుంచి 250-300 కువైటీ దినార్లు తీసుకుని వీరు నకిలీ కరోనా సర్టిఫికేట్లు జారీ చేశారు. ఇలా మొత్తం నలుగురికి ఫోర్జరీ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు ఇచ్చారని అధికారుల విచారణలో తేలింది. కువైట్ లోని జహ్రా ఆస్పత్రికి చెందిన ఈ ముగ్గురు నర్సులు ఇలా ఫోర్జరీ సర్టిఫికేట్లతో గత కొంతకాలంగా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్విస్టిగేషన్ గుర్తించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com