రేపు సుప్రీం కమిటీ భేటీ..కోవిడ్ ఆంక్షలపై సమీక్ష
- July 28, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ నేడు సమావేశం కానుంది. ప్రస్తుతం సుల్తానేట్‌లో వైరస్ తీవ్రత, అవలంభించాల్సిన విధాన నిర్ణయాలు, అమలులో ఉన్న ఆంక్షల కొనసాగింపు, సడలింపులపై కమిటీ సమీక్షించనుంది. దేశంలో ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులు, జనజీవనంలో మార్పులపై తమకు స్పష్టత ఉందని..అయితే వైరస్ తీవ్రతను అనుసరించే తమ నిర్ణయాల పరిమితి ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది అన్నారు. గ్యాదరింగ్ వల్లే వైరస్ తీవ్రత పెరుగుతున్న విషయం ఇప్పటికే అందరి అవగాహనకు వచ్చిందని, వైరస్ కట్టడికి తగినంత ఔషధ ఉత్పత్తి కష్టతరమే కాబట్టి నివారణ మార్గాల వైపే మొగ్గు చూపనున్నట్లు సంకేతం ఇచ్చారు. ఇక ఒమన్ కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగింపు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. నిర్దిష్ట ప్రమాణాలు అనుసరించే ఆయా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ అమలులో ఉందని, అయితే..వైరస్ తీవ్రత తగ్గిన పలు దేశాలను నిషేధ జాబితాలో నుంచి తొలిగించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







