యూఏఈ: 9 మందికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా

- July 28, 2021 , by Maagulf
యూఏఈ: 9 మందికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా

యూఏఈ: బోగస్ క్రిప్టోకరెన్సీ నేరానికి పాల్పడ్డ 9 మంది సభ్యుల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థనం. ఒక్కో నిందితుడికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా కూడా విధించింది. 18 మిలియన్ దిర్హాములను బోగస్ క్రిప్టో కరెన్సీ ట్రేడ్ ద్వారా నిందితులు సమకూర్చుకున్నారని అభియోగాలు మోపబడ్డాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులు మనీ లాండరింగ్‌కి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. మంచి ఇన్వెస్టిమెంట్ విధానంగా, ఎలాంటి వివాదాల్లేని వ్యవహారంగా నమ్మించి, బాధితుల నుంచి నిందితులు డబ్బుని వసూలు చేశారు. వారిని నమ్మి, బాధితులు పెద్దమొత్తంలో డబ్బుని నిందితుల ఖాతాల్లోకి పంపించారు. కాగా, నిందితుల్ని శిక్షా కాలం పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com