అఫ్ఘనిస్తాన్: ఇంటి నుంచి లాక్కెళ్లి ప్రముఖ కమెడియన్ హత్య
- July 28, 2021
అఫ్ఘనిస్తాన్ : అఫ్ఘనిస్తాన్ ప్రముఖ కమెడియన్ నాజర్ మొహమ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. తాలిబన్లే నాజర్ మొహమ్మద్ ను చంపారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కమెడియన్ నాజర్ మొహమ్మద్ ను ఇంటి నుంచి లాక్కెళ్లి దారుణంగా హత్య చేశారని తెలిసింది. అఫ్ఘనిస్తాన్ కాందహార్ ప్రావిన్స్‌లో ఖాషా జ్వాన్‌గా ప్రసిద్ది చెందిన హాస్యనటుడు నాజర్ మొహమ్మద్ దారుణ హత్య ప్రపంచాన్ని వణికించింది.
స్థానిక మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు నాజర్ మొహమ్మద్ ఇంట్లోకి ప్రవేశించి.. గన్స్ తో బెదిరించి అతడిని బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నాజర్ని హత్య చేసినట్లు ప్రచురించారు. నాజర్ కమెడియన్ కావడానికి ముందు కాందహార్ ప్రావిన్స్‌లో పోలీసు అధికారిగా విధులు నిర్వహించేవాడు.
తాలిబన్లే ఈ దారుణానికి ఒడిగట్టారని కమెడియన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ మాత్రం ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఖండించింది. అఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలపై తాలిబాన్లు తమ దాడిని తీవ్రతరం చేశారు. ఇప్పటికే దాదాపు 70 శాతం అఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ఈ దారుణం జరిగిందని భావిస్తున్నారు. కాందహార్‌లో పలు కుటుంబాలు యుద్ధం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల నుంచి పారిపోతున్నాయి. వీరంతా అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
కాందహార్ పార్లమెంట్ సభ్యుడు సయ్యద్ అహ్మద్ సైలాబ్ మాట్లాడుతూ.. ''ఈద్ వేడుకల తరువాత, తాలిబన్లు కాందహార్ ప్రావిన్స్‌లోని అఫ్ఘన్ దళాలపై దాడులను ముమ్మరం చేశారు. భద్రత కోసం పారిపోయిన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని'' అని ఇండియా టుడే టీవీకి తెలిపారు. అంతేకాక కాందహార్ సమీపంలోని వలస శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలకు ఆహారం, వైద్య సంరక్షణ అందిస్తున్నామని తెలపారు. ''గ్రామాలను విడిచిపెట్టి కాందహార్ వస్తున్న అన్ని కుటుంబాలకు రెండుసార్లు బ్రేక్ ఫాస్ట్, భోజనం అందించాలని మేము నిర్ణయించుకున్నాము'' అని సయ్యద్ అహ్మద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్‌లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









