దుబాయ్‌లో కొత్త పార్కింగ్‌ విధానం

- March 11, 2016 , by Maagulf
దుబాయ్‌లో కొత్త పార్కింగ్‌ విధానం

క్రౌన్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ దుబాయ్‌ మరియు చైర్మన్‌ ఆఫ్‌ ది దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, దుబాయ్‌లో పబ్లిక్‌ పార్కింగ్‌కి సంబంధించి కొత్త రిజల్యూషన్‌ని జారీ చేశారు. ఈ నిర్ణయంతో దుబాయ్‌లోని పబ్లిక్‌ పార్కింగ్‌ స్థలాలను రెండు విభాగాలుగా విభజించారు. ఇందులో ఒకదానికి సంబంధించి పార్కింగ్‌ టారిఫ్‌ని రివైజ్‌ చేశారు. దుబాయ్‌లో మొత్తం 130,000 పార్కింగ్‌ స్లాట్స్‌ ఉండగా, అందులో 30,000 మాత్రమే అంటే 23 శాతం స్లాట్స్‌కు మారిన టారిఫ్‌ వర్తిస్తుంది. 
స్ట్రీట్‌ సైడ్‌ పార్కింగ్‌ ఫీజు 
30 నిమిషాలకు 2 దిర్హామ్‌లు, గంటకు 4 దిర్హామ్‌లు, 2 గంటలకు 8 దిర్హామ్‌లు, 3 గంటలకు 12 దిర్హామ్‌లు 
పార్కింగ్‌ లాట్స్‌లో మార్పు ఇలా 
గంటకు 3 దిర్హామ్‌లు, 2 గంటలకు 6 దిర్హామ్‌లు, 3 గంటలకు 9 దిర్హామ్‌లు, 4 గంటలకు 12 దిర్హామ్‌లు,5 గంటలకు 15 దిర్హామ్‌లు, 24 గంటలకు 20 దిర్హామ్‌లు. 
స్ట్రీట్‌ సైడ్‌ పార్కింగ్‌ స్లాట్స్‌ మారనవి 
గంటకు 2 దిర్హామ్‌లు, 2 గంటలకు 5 దిర్హామ్‌లు, 3 గంటలకు 9 దిర్హామ్‌లు, 4 గంటలకు 11 దిర్హామ్‌లు 
మిగతా ప్రాంతాల్లో 
గంటకు 2 దిర్హామ్‌లు, 2 గంటలకు 4 దిర్హామ్‌లు, 3 గంటలకు 5 దిర్హామ్‌లు, 4 గంటలకు 7 దిర్హామ్‌లు, 24 గంటలకు 10 దిర్హామ్‌లు 
పెయిడ్‌ పార్కింగ్‌ టైమ్‌ని రోజుకి 14 గంటలుగా నిర్ధారించారు. శుక్రవారం, పబ్లిక్‌ హాలిడేస్‌ సమయాల్లో మాత్రం మార్పులు ఉంటాయి. మల్టీ స్టోరీ పార్కింగ్‌లో గంటకు 5 దిర్హామలు రుసుము చెల్లించాలి. 
స్ట్రీట్‌సైడ్‌ సీజనల్‌ పార్కింగ్‌ కార్డ్స్‌ 
క్వార్టర్‌కి 1400 దిర్హామ్‌లు, ఆరు నెలలకు 2,500 దిర్హామ్‌లు, సంవత్సరానికి 4,500 దిర్హామ్‌లు. 
పార్కింగ్‌ లాట్స్‌ 
క్వార్టర్‌కి 700 దిర్హామ్‌లు, 6 నెలలకు 1300 దిర్హామ్‌లు, ఏడాదికి 2,400 దిర్హామ్‌లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com