72 గంటల్లోపు అబుధాబి తిరిగొస్తే, కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు

- July 29, 2021 , by Maagulf
72 గంటల్లోపు అబుధాబి తిరిగొస్తే, కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు

యూఏఈ: 72 గంటల లోపు అబుధాబికి తిరిగొచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 పీసీఆర్ టెస్టు రిపోర్టు అవసరం లేదని ఎతిహాద్ ఎయిర్ వేస్ వెల్లడించింది.వ్యాపార కార్యకలాపాల నిమిత్తం, తక్కువ సమయంలో వెళ్లి వచ్చేవారికి, ప్రయాణం మరింత సులభతరం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. 72 గంటలలోపు ప్రయాణాలకు యుఏఈలో తీసుకున్న పీసీఆర్ టెస్టు రిజల్ట్ తిరిగి రావడానికి కూడా ఉపయోగపడుతుంది.72 గంటల లోపు అది చెల్లుబాటవుతుంది. కాగా, ఎతిహాద్ సంస్థ 100 శాతం తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించింది. కాగా, ఆగస్టు 2 వరకూ బంగ్లాదేశ్, శ్రీలంక, నుండి యూఏఈ కి ప్రయాణాలు తాత్కాలికంగా సస్సెండ్ చేసింది. అధికారిక పర్యటనల నిమిత్తం వచ్చేవారికి పదేళ్ల గోల్డెన్ వీసా కలిగిన వారికి ఈ సస్పెన్షన్ నుండి వెసులుబాటు కల్పించారు. ఇండియా, పాకిస్థాన్ కూడా ఈ సస్పెన్షన్ జాబితాలో ఉన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com