భారత టెక్కీలకు శుభవార్త..
- July 30, 2021
అమెరికా: యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ తీపికబురందించింది.భారత టెక్కీలకు శుభవార్త.రెండో రౌండ్ లాటరీ పద్దతిలో హెచ్ 1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.మొదటి రౌండ్ లాటరీ విధానంలో అనుకున్న స్ధాయిలో ఎంపికలు జరగకపోవటంతో రెండో రౌండ్ లాటరీ నిర్వహిస్తున్నట్లు యుఎస్ సి ఐఎస్ ప్రకటించింది.
హెచ్ 1బీ వీసాలకు ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉంది. ప్రతిఏటా అమెరికా 85వేల కొత్త హెచ్ 1 వీసాలను జారీచేస్తుంది. వృత్తి నైపుణ్య నిపుణులు వీటిని సద్వినియోగం చేసుకుంటుంటారు. వీరిలో అధిక సంఖ్యలో చైనా, భారత్ వంటి దేశాలకు చెందిన ఐటీ సంస్ధలకు చెందిన నిపుణులు ఉంటున్నారు. వీసాల జారీ విషయంలో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం నిర్ణయించటంతో మొదటి రౌండ్ లాటరీ విధాన్ని పూర్తిచేశారు.
ఆగస్టు 2 నుండి ప్రారంభం కానున్న పిటిషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనుంది. ఇదిలా వుంటే వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30 వరకు హెచ్ 1బీ వీసాలకు దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరిని హెచ్ 1బీ వీసాలకు మొదటి లాటరీలో ఎంపిక చేసింది. ప్రస్తుతం రెండో రౌండ్ లాటరీ ద్వారా హెచ్ 1బీ వీసాలు జారీ చేస్తామన్న ప్రకటనతో స్టెమ్, ఒపీటీ విద్యార్ధులకు ఊరట లభించినట్లైంది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









