ఆగస్టు 1 నుండి కొత్త ప్రయాణ విధానానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి
- July 30, 2021
కువైట్: ఆగస్టు 1 నుండి కువైట్ వచ్చేవారికి సంబంధించి, కొత్త ట్రావెల్ విధానానికి సంబంధించిన ఏర్పాట్లను మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ పూర్తి చేసింది. సంబంధిత అధారిటీస్‌తో ఆరోగ్యం మరియు భద్రత అంశాలకు సంబంధించి సమన్వయం చేస్తున్నట్లు మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ చెప్పారు. మినిస్ర్టీ ఇప్పటికే విదేశాల్లో వ్యాక్సిన్ పొందిన వారికి సంబంధించి, వ్యాక్సిన్ సర్టిఫికెట్లను పరిశీలించేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది. కువైట్ వచ్చేవారు తప్పక తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మినిస్ర్టీ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేసే అప్రూవల్ కోసం వేచి చూడాలి. అలాగే, తమ వెంట వ్యాక్సినేసన్ సర్టిఫికెట్ తీసుకురావాలి. క్యూఆర్ కోడ్ తప్పనిసరి. అలాగే, 72 గంటల ముందు తీసుకున్న కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ తమ వెంట తెచ్చుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకూడదు. తుమ్మకూడదు. జలుబు, దగ్గు ఉండకూడదు.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ రక్షా బంధన్ ఉత్సవాలు..10 వేల రాఖీలు అందజేత
- ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- TSRTC బంపరాఫర్: 12 ఏళ్ల వరకు ఆ చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం
- ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం
- గృహ కార్మికుల పరీక్షలు ప్రైవేటీకరణ
- ప్రజల కోసం సలాలా గ్రాండ్ మాల్ తెరవబడింది
- షేక్ ఇబ్రహీం బిన్ మొహ్మద్ అవెన్యూ లో నూతన ట్రాఫిక్ సిగ్నల్