ఘనంగా జరిగిన డా.సి నారాయణ రెడ్డి 90వ జయంతి

- July 30, 2021 , by Maagulf
ఘనంగా జరిగిన డా.సి నారాయణ రెడ్డి 90వ జయంతి

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అభినందనలతో వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, తెలుగు కళాసమితి ఒమన్, వేగేశ్న ఫౌండేషన్, సంతోషం ఫిల్మ్ న్యూస్, శారదా ఆకునూరి, అమెరికా వారల సంయుక్త ఆధ్వర్యంలో, హ్యూస్టన్ నగర వేదికగా,జ్ఞానఫీఠ మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత, మహా కవి డా.సి.నారాయణ రెడ్డి 90వ జయంతి, అంతర్జాలంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వంశీ సంస్థ వ్యవస్థాపకులు కళా బ్రహ్మ,శిరోమణి డా.వంశీ రామరాజు స్వాగతం పలుకుతూ, గత 40 సంవత్సరాల నుంచి డా.సి.నా.రె జన్మదినాన్ని, జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.సి.నా.రె రాజ్యసభ సభ్యులుగా వున్నప్పుడు, ఎమ్ పి లాడ్స్ నిధుల నుంచి  42 లక్షల రూపాయల కేటాయించి వేగేశ్న ఫౌండేషన్ లోని దివ్యాంగుల కొరకు ఒక భవంతి నిర్మించడానికి దోహదం చేసారని చెప్పారు.. అమెరికా గాన కోకిల శారద ఆకునూరి సమన్వయకర్త గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డా.సి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు జ్యోతి ప్రకాశనం చేసారు.

ప్రముఖ దర్శకులు పద్మశ్రీ పురస్కార గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్  వీడియో ద్వారా సినారె కు వారికి ఉన్న అనుబంధాన్ని తెలియచేసారు.డా.సి.నారాయణ రెడ్డి మొదటి పాటకు నటించిన ప్రజానటి, కళాభారతి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు డా.జమునా రమణారావు, సినీ నటులు, నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీ మోహన్, సినీ నిర్మాత దర్శకులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ, జాతీయ కవి సుద్దాల అశోక తేజ, సంగీత దర్శకులు సాలూరు వాసూరావు, సినీగేయ రచయిత భువనచంద్ర, సంగీత దర్శకులు మాధవపెద్ధి సురేష్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, గీతా గాన గంధర్వ ఎల్ వి గంగాధర శాస్త్రి,అపర ఘంటసాల తాతా బాలకామేశ్వర రావు, అమెరికా నుంచి డా.శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, లండన్ నుంచి డా.నగేష్ చెన్నుపాటి, సంతోషం ఫిల్మ్ న్యూస్ వ్యవస్థాపకులు సురేష్ కొండేటి, తెలుగు కళాసమితి ఒమన్,అనిల్ కుమార్ కడించెర్ల, హరి వేణుగోపాల్ ఒమన్, సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దీపికా రవి,వంశీ అధ్యక్షులు డా.తెన్నేటి సుధ దేవి,మేనేజింగ్ ట్రస్టీ వంశీ,చెయిర్ పర్సన్ వేగేశ్న, సుంకరపల్లి శైలజ ఈ కార్యక్రమంలో పాల్గొని డా.సి.నా.రె కి ఘన నివాళులర్పించారు.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com