ఎక్స్‌పో 2020 దుబాయ్: కరోనా తర్వాత ఆర్ధిక రంగానికి కొత్త ఊతం
- July 30, 2021
దుబాయ్: ప్రపంచంలోనే అతి పెద్ద షో. దుబాయ్ ఎక్స్‌పో 2020 కరోనా తర్వాత ఆర్ధిక రంగానికి కొత్త ఊతాన్ని ఇవ్వనుందని భారత కాన్సూల్ జనరల్ డాక్టర్ అమన్ పురి చెప్పారు. ఆర్ధిక రంగం తిరిగి పుంజుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, వ్యాపార సంస్థలు దీన్నొక అద్భుతమైన వేదికగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ఛాలెంజింగ్ పరిస్థితుల్లో యుఏఈ సాహసోపేతంగా ఈ ఈవెంట్ నిర్వహించడాన్ని అభినందించారాయన. ఈ ఎక్స్‌పో ద్వారా వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించాలని భారతదేశం భావిస్తోందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా మరియు స్టార్టప్ ఇండియా నినాదాలతో ఈ ఎక్స్‌పో ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నట్లు చెప్పారు. లక్షలాది, కోట్లాది ఆలోచనలకు ఇండియా మంచి వేదిక. కాబట్టి, ప్రపంచం ఈ ఆలోచనల నుంచి లాభపడాలనీ, అలాగే ప్రపంచ దేశాల నుండి భారత దేశం అత్యద్భుత సాయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇండియా, కొరియా మధ్య బిజినెస్ మీట్ సందర్భంగా అమన్ పురి చెప్పారు. పలు ఎంబసీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామనీ ఆయా దేశాల నుంచి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నామనీ అన్నారు. ఇండియా, కొరియా భాగస్వామ్యం ప్రాంతంలో అత్యంత ప్రత్యేకమైనదనీ చెప్పారాయన. కొరియన్ కాన్సూల్ జనరల్ మూన్ బై యుంగ్ జున్ మాట్లాడుతూ ఇండియా, కొరియా ప్రపంచంలోనే అతి పెద్ద ఎకనమిక్ పవర్స్ అని అన్నారు.



తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







