'గోదావరి గౌరవ్‌' అవార్డును అందుకున్నానానా పటేకర్‌

- March 11, 2016 , by Maagulf
'గోదావరి గౌరవ్‌' అవార్డును అందుకున్నానానా పటేకర్‌

బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ శుక్రవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 'గోదావరి గౌరవ్‌' అవార్డును అందుకున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు గాను జాతీయస్థాయిలో ఈ అవార్డును అందిస్తారు. సంగీతం, క్రీడలు, సినిమా, సోషల్‌ వర్క్‌, సైన్స్‌ రంగాల్లో ప్రముఖులను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. దివంగత కవి వీవీ శిర్వాద్కర్‌కు గుర్తుగా గోదావరి గౌరవ్‌ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. నృత్యకారిణి కనక్‌ రేలే, చేతన సిన్హా, శాస్త్రవేత్త డా.శశికాంత్‌, ఆర్కిటెక్చర్‌ బాలక్రిష్ణ దోషి, సైక్లిస్టులు మహింద్ర, జితేంద్ర మహజన్‌, ప్రకాశ్‌ ఆమ్టే, గాయకుడు గంగూబాయి హంగల్‌, దర్శకుడు హృషికేశ్‌ ముఖర్జీ, శాస్త్రవేత్త రఘునాథ్‌ మషేల్కర్‌లు ఈ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com