ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాంకింగ్, ఆర్థిక రంగ సేవల్లో స్వల్ప మార్పులు
- July 31, 2021
ముంబై: ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాంకింగ్, ఆర్థిక రంగ సేవల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచింది. రేపటినుంచి (ఆదివారం)ఇవి అమల్లోకి రానున్నాయి. జరిగే స్వల్ప మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..! ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎంలలో ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది.
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు నెలకి నాలుగు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 150 రుసం చెల్లించాలి. ఇతరులు కూడా రూ. 25 వేలు మాత్రమే జమ చేయవచ్చు. డాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్బుక్కు రూ.20 చెల్లించాలి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్స్టెప్ సేవలకు ఛార్జీలు విధిస్తున్నట్లుగా పేర్కొంది. ఇంటి వద్దకే సేవలు కోరుకునే కస్టమర్లు ప్రతి సర్వీసుకు రూ. 20+GST చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









