మైనర్ యాక్సిడెంట్లపై ఆన్ లైన్ రిపోర్టింగ్ సిస్టం
- August 01, 2021
బహ్రెయిన్: చిన్న ట్రాఫిక్ ప్రమాదాల రిపోర్టింగ్ ప్రక్రియను సరళీకృతం చేయడానికి బహ్రెయిన్ ప్రభుత్వం ఈ-ట్రాఫిక్ యాప్ ద్వారా కొత్త సేవలు ప్రారంభించింది. ఈ విధానంతో రోడ్లపై జరిగే మైనర్ యాక్సిడెంట్ల వివరాలు నేరుగా రిపోర్ట్ అవుతాయి.అలాగే ఆ సమాచారం బీమా కంపెనీలకు చేరుతుందని ఇన్ఫర్మేషన్ & ఈ -గవర్నమెంట్ అథారిటీ(iGA) వెల్లడించింది. ఈ-ట్రాఫిక్ విధానంలో నాలుగు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రిపోర్ట్ ట్రాపిక్ యాక్సిడెంట్స్- రిపోర్ట్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ద్వారా దేశ పౌరులు, ప్రవాసీయులు, జీసీసీ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు మైనర్ రోడ్డు ప్రమాదాల పట్ల బీమా కంపెనీలను అప్రమత్తం చేయవచ్చు.
వ్యూ రిపోర్టెడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్- వ్యూ రిపోర్టెడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తో రిపోర్ట్ అయిన ప్రమాదాల వివరాలను తెలుసుకోవచ్చు.
ట్రాఫిక్ యాక్సిడెంట్ అక్నాలెడ్జ్ మెంట్ - ట్రాఫిక్ యాక్సిడెంట్ అక్నాలెడ్జ్ మెంట్ తో ప్రమాదానికి బాధ్యుడైన డ్రైవర్ ఎవరు తెలుసుకునేందుకు వీలుంటుంది.
ఇన్సూరెన్స్ కంపెనీస్ లోకేటర్ - ఇన్సూరెన్స్ కంపెనీస్ లోకేటర్ ద్వారా బీమా కంపెనీలు, అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి, వాటి కాంటెక్ట్ నెంబర్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









