జాబర్ ఆస్పత్రిలో స్టాఫ్ కు మాత్రమే వ్యాక్సినేషన్

- August 01, 2021 , by Maagulf
జాబర్ ఆస్పత్రిలో స్టాఫ్ కు మాత్రమే వ్యాక్సినేషన్

కువైట్: జాబర్ అల్-అహ్మద్ అల్-సబా హాస్పిటల్‌లో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారనే ప్రచారాన్ని వైద్య శాఖ కొట్టిపారేసింది. ప్రస్తుతం జాబర్ అల్-అహ్మద్ అల్-సబా హాస్పిటల్‌లో నడుస్తున్న కోవిడ్ -19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఆసుపత్రి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. అయితే..జాబర్ ఆస్పత్రిలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారని, అదికూడా ముందస్తు అపాయింట్మెంట్లు, రిజిస్ట్రేషన్లు లేకుండానే నేరుగా ఆస్పత్రికి వెళ్లొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వైద్య శాఖ వ్యాక్సినేషన్ పై క్లారిటీ ఇచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com