900 మంది చిన్నారులపై సినోఫార్మ్ వ్యాక్సిన్ స్టడీ

- August 02, 2021 , by Maagulf
900 మంది చిన్నారులపై సినోఫార్మ్ వ్యాక్సిన్ స్టడీ

యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 12 ఏళ్లు అంతకుమించిన వయసు వారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నారు.అయితే..డెల్టా వేరియంట్, ఆ తర్వాత పుట్టుకొచ్చే కొత్త వేరియంట్లతో చిన్నారులకు ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో చిన్నారుల భవిష్యత్తులపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే చిన్నారులకు కూడా వీలైనంత తొందరగా వ్యాక్సిన్ తో అదనపు ఇమ్యూనిటీ అందించేందుకు పలు కంపెనీలు తమ అధ్యయనాలను వేగవంతంగా చేస్తున్నాయి. ఇందులో భాగంగా అబుధాబి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చిన్నారులపై వ్యాక్సిన్ ప్రభావాన్ని స్టడీ చేస్తోంది.ఇందు కోసం వివిధ జాతీయుల నుంచి 3 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న 900 మంది చిన్నారులను ఎంపిక చేసి..వారిలో సినోఫార్మ్ వ్యాక్సిన్ ప్రభావాన్ని అధ్యాయనం చేస్తోంది. చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించటం..రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు సినోఫార్మ్ వ్యాక్సిన్ ప్రభావశీలతను పరిశీలిస్తోంది. ఈ అధ్యయనం పూర్తై..ప్రాథమిక నివేదక అందితే చిన్నారులకు స్కూల్ నిర్వహణ ప్రణాళికపై ఓ అవగాహన ఏర్పడుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com