'కొత్త కవిత - అంతర్జాతీయ కవి సమ్మేళనం'
- August 02, 2021
"వంశీ ఇంటర్నేషనల్", "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్, "తెలుగు కళా సమితి" ఒమన్, "సంతోషం ఫిలిం న్యూస్" వారి ఆధ్వర్యంలో డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి, అమెరికా సహకారంతో ఆదివారం అంతర్జాలంలో అద్భుతంగా 12 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించబడిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో 20 దేశాల నుండి సుమారు 190 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు.

అందరినీ అలరించిన ఈ కార్యక్రమానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, సాహితీవేత్త, కె.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోపన్యాసం అందించారు.అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రత్యేక అతిథులుగా "తెలంగాణ సారస్వత పరిషత్" కార్యదర్శి జె.చెన్నయ్య, "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, "ఒమన్ తెలుగు కళా సమితి" కన్వీనర్ అనిల్ కుమార్ తదితరులు, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుండి రావి దీపిక మరియు వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని, కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేశారు.

కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు మాట్లాడుతూ "వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న "కొత్త కథలు" సంకలనం వలె, ఈ సంవత్సరం నుండి "కొత్త కవిత" అనే కవితా సంకలనం తీసుకురావాలనే సంకల్పంతో డాక్టర్ సి.నారాయణరెడ్డి 90 వ జయంతిని పురస్కరించుకొని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, డా.ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి సహకారంతో త్వరలో ఈ కార్యక్రమంలో చదవబడిన కవితలన్నీ,కవితా సంకలనంగా ముద్రించబడతాయి" అని తెలిపారు.
భారతదేశం నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర,సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డి కి కవితానివాళులు అర్పించగా,న్యూజిలాండ్,ఆస్ట్రేలియా,సింగపూర్,మలేషియా,హాంకాంగ్, ఇండోనేషియా,ఒమన్, ఖతార్,సౌదీ అరేబియా,యూఏఈ, కువైట్, బహ్రెయిన్,మారిషస్, దక్షిణాఫ్రికా,యుగాండా,యునైటెడ్ కింగ్డమ్,నార్వే, కెనడా,అమెరికా దేశాలనుండి ఎంతో మంది కవులు, కవయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా అందరినీ ఆకర్షించింది.

కార్యక్రమ సహ నిర్వాహకులు "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "సింగపూర్ నుండి తొలిసారి ఈ కార్యక్రమంలో 14 మంది కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని" ఆనందం వ్యక్తం చేశారు.

రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో ప్రారంభ సమావేశం,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు తూర్పు ఆసియా దేశాల కవితా పఠనం కొనసాగగా,ఆఫ్రికా ఐరోపా ఖండాల వారికి పీసపాటి జయ,మధ్య ఆసియా దేశాలవారికి కొండూరు కళ్యాణి, కెనడా వారికి రాయవరపు లక్ష్మి, అమెరికా వారికి నోరి రాధిక సహవ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.


తాజా వార్తలు
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది
- 'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- పోలీస్ శాఖ కోసం రూ.600 కోట్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ ప్రభుత్వం
- ఆగని పైరసీ..కొత్తగా ఐబొమ్మ వన్
- నలుగురు కీలక నిందితుల అరెస్ట్
- తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!
- సూడాన్ యుద్ధాన్ని ముగించడానికి కృషి..ట్రంప్
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ రద్దు, మళ్లింపు..!!







