తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- August 02, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,07,472 శాంపిల్స్‌ను పరీక్షించగా 591 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో.. 643 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,45,997కు పెరగగా.. కోలుకున్న వారి సంఖ్య 6,33,371కు చేరింది.. ఇక, కోవిడ్‌తో ఇప్పటి వరకు 3,807 మంది కన్నుమూశారు.మరోవైపు రాష్ట్రంలో రికవరీ రేటు 98.04 శాతంగా ఉందని తెలిపింది ప్రభుత్వం.. ప్రస్తుతం 8,819 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొంది.ఇక తాజా కేసుల్లో అత్యధికంగా కరీంనగర్లో 75 కొత్త కేసులు వెలుగు చూడగా…GHMCలో 68, ఖమ్మంలో 58, వరంగల్ అర్బన్‌లో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







