అబుధాబి స్కూళ్లల్లో ప్లే ఏరియా, క్యాంటిన్ కు గ్రీన్ సిగ్నల్
- August 03, 2021
అబుధాబి: వ్యాక్సినేషన్ ముమ్మరం చేసిన తర్వాత స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించిన అబుధాబి పాలక వర్గం...స్కూళ్లలో మునుపటిలా సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా డిసిషన్ తీసుకుంది. గ్రౌండ్లో ఆటలు ఆడేందుకు, స్కూల్ క్యాటింన్, ఫిజికల్ ఎడ్యూకేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత సెప్టెంబర్ లో తిరిగి స్కూళ్లలను ప్రారంభించాలని అబుధాబి నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే..కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల భద్రతకు తగిన ప్రమాణాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎడ్యూకేషన్&నాలెడ్జ్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఫిజికల్ డిస్టెన్స్ కోసం క్లాసు రూంలలో ప్రతి విద్యార్ధికి మధ్య మీటర్ ఎడం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం అదనపు తరగతి గదులను కూడా సిద్ధం చేస్తున్నారు. స్కూల్ గ్రౌండ్, క్యాంటిన్, ఇతర కామన్ ఏరియాల్లోనూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర కారణాలతో వ్యాక్సిన్ తీసుకోని వారికి ఆన్ లైన్ క్లాసెస్ ఆప్షన్ కూడా ఉందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







