రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ కు విపక్షాల సైకిల్ ర్యాలీ

- August 03, 2021 , by Maagulf
రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ కు విపక్షాల సైకిల్ ర్యాలీ

న్యూ ఢిల్లీ: రాహుల్ గాంధీ సైకిల్ పై పార్లమెంట్ కు వచ్చారు. ప్రతిపక్షాల సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించిన రాహుల్ గాంధీ…“ఆప్”, బి.ఎస్.పి లు మినహాయించి మొత్తం 18 పార్టీలకు చెందిన ఉభయసభలకు చెందిన నేతలు హాజరయ్యారు. “పెగసస్” సాఫ్టువేర్‌ను మోడి ప్రభుత్వం కొన్నదా…!? దేశంలో ప్రతిపక్ష నేతలు, పలువురు ప్రముఖులకు వ్యతిరేకంగా “పెగసస్” ను ప్రయోగించారా..!?, అని మాత్రమే అడుగుతున్నామని సమావేశంలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా పార్లమెంట్ కు సైకిళ్ళ పై రావాలనే యోచనలు చేసాయి ప్రతిపక్షాలు.

నిన్ మధ్యాహ్నం రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడుగా ఉన్న మల్లికార్జున ఖార్గే కు ఫోన్ చేసి సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన రక్షణ మంత్రి రాజనాధ్… పార్లమెంట్ లో చర్చలకు ప్రభుత్వం అంగీకరించాలని స్పష్టం చేసారు. “పెగసస్” కుంభకోణం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, అదుపులో లేని పెట్రోధరలు, దేశంలో “కోవిడ్-19” నిర్వహణ లాంటి అంశాలపై చర్చకు పట్టువడుతున్నాయి ప్రతిపక్షాలు. “పెగసస్” కుంభకోణం పై దర్యాప్తు జరపాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేసారు. అయితే పెగసస్” కుంభకోణం పై దర్యాప్తు ను డిమాండ్ చేసిన మొట్టమొదటి బిజేపి భాగస్వామ్యపక్షం జేడియు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com