సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల..
- August 03, 2021
న్యూ ఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్ష ఫలితాలు మంగళవారం 12 గంటలకు విడుదలయ్యాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10,12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.గతవారం 12వ తరగతి ఫలితాలు విడుదల చేయగా, రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే వాస్తవానికి పదో తరగతి ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉండగా, పాఠశాలల నుంచి మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం కావడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది. తాజాగా ఈ ఫలితాలను బోర్డు విడుదల చేసింది.
ఫలితాలు చెక్ చేసుకోండిలా..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు ఫలితాలు అధికారి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. ఫలితాల కోసం http://cbseresults.nic.in లో చూసుకోవచ్చు.అలాగే http://cbse.gov.in, http://cbse.nic.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు.ఫలితాల మార్క్ షిట్‌లు, సర్టిఫికేట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.మూల్యాంకన ప్రకారం.. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లు, అర్ధ సంవత్సరం లేదా మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్ పరీక్షలలో విద్యార్థుల పనితీరును బట్టి మార్కులు కేటాయించారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







