ఎల్‌ఐసీ: పెట్టుబడి రూ.4 లక్షలు.. లాభం రూ.27 లక్షలు

- August 03, 2021 , by Maagulf
ఎల్‌ఐసీ: పెట్టుబడి రూ.4 లక్షలు.. లాభం రూ.27 లక్షలు

ఎల్‌ఐసీ ప్రవేశ పెట్టే అనేక పథకాల్లో సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ టేబుల్ నంబర్ 917 ఒకటి. దీనిలో ఒకసారి ప్రీమియం చెల్లిస్తే చాలు భారీ మొత్తం రిటర్న్‌గా అందుతుంది. ఇది ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ పాలసీ. ఈ పాలసీని 3 నెలల కంటే ఎక్కువ వయసున్న పిల్లల నుంచి తీసుకోవచ్చు. గరిష్ట వయో పరిమితి 65 సంవత్సరాలు. ఉదాహరణకు 35 సంవత్సరాలు ఉన్న ఓ వ్యక్తి 25 సంవత్సరాల మెచ్యూరిటీ కాలానికి రూ.10 లక్షల సమ్ అస్యూర్డ్ పాలసీని తీసుకున్నారనుకుందాం. అతడు 25 సంవత్సరాలకు రూ.4,67,585 చెల్లించాల్సి ఉంటుంది. ఇది అతడు చెల్లించాల్సిన సింగిల్ ప్రీమియం. పాలసీ మెచ్యూరిటీ పీరియడ్ 25 ఏళ్ల తరువాత అతడు.. పాలసీ హామీ మొత్తం రూ.10,00,000, రూ.12,75,000 వెస్ట్ రివిజినరీ బోనస్ కింద పొందుతాడు. కట్టిన పాలసీ మొత్తంతో కలిపి 27,25,000లు వస్తుంది. ఈ పాలసీలో పన్ను మినహాయింపు సౌకర్యం కూడా ఉంది.

మీరు ప్లాన్ కింద అధిక స్థాయి కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి ప్లాన్ వ్యవధిలో మీకు డబ్బు అవసరమైతే మీరు పాలసీ రుణాన్ని పొందవచ్చు మీరు గడువు పూర్తయ్యేలోపు నిష్క్రమించాలనుకుంటే, హామీ ఇచ్చిన సరెండర్ విలువను చెల్లిస్తుంది. బీమా చేసిన వ్యక్తి 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే రిస్క్ కవర్ వెంటనే ప్రారంభం కాదు. ఆ సందర్భంలో, పాలసీని కొనుగోలు చేసిన రెండు సంవత్సరాల తర్వాత లేదా బీమా చేసిన 8 వ పుట్టినరోజు తర్వాత పాలసీ వార్షికోత్సవం నుండి, ఏది ముందుగా ఉంటే, కవరేజ్ ప్రారంభమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com