ట్యాంకర్ హైజాకింగ్‌పై ప్రకటన

- August 04, 2021 , by Maagulf
ట్యాంకర్ హైజాకింగ్‌పై ప్రకటన

ఒమన్: మెరైన్ ట్యాంకర్ హైజాకింగ్‌పై మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటన విడుదల చేసింది. అస్ఫాల్ట్ ప్రిన్సెస్ పేరు గల ఓ మెరైన ట్యాంకర్ హైజాకింగ్ ఘటనపై మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటన విడుదల చేసింది. సుల్తానేట్‌లోని కేంద్రం అలాగే, ఈ ప్రాంతంలోని మరిన్ని కేంద్రాల సమన్వయంతో జరిగిన ఘటనపై విచారణ చేపడుతున్నట్లు మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ వెల్లడించింది. ఒమన్ సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ ట్యాంకర్ హైజాకింగ్‌కి గురైంది. ట్యాంకర్ మీద పనామా జెండా ఉంది. కాగా, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ అనుమానిత ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com