ఆచార్య కొత్త పోస్టర్ రిలీజ్

- August 04, 2021 , by Maagulf
ఆచార్య కొత్త పోస్టర్ రిలీజ్

హైదరాబాద్: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని.ఇక రెండు పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉందని తెలుపుతూ. చిరంజీవి రామ్ చరణ్ అడవులలో కూర్చున్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు లాంగ్ గ్యాప్ తరువాత మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com