ప్రయాణాలకు వ్యాక్సిన్ లింక్ పై కేబినెట్ కీలక నిర్ణయాలు
- August 06, 2021
కువైట్: అంతర్జాతీయ ప్రయాణాలకు, సరిహద్దులు దాటి దేశంలోకి వచ్చే ప్రయాణికుల ఎంట్రీకి సంబంధించి వ్యాక్సిన్ నిబంధనలపై కువైట్ మంత్రి మండలి చర్చించింది.షేక్ సబా అల్-ఖలీద్ అల్-హమద్ అల్-సబా అధ్వర్యంలో సమావేశమైన మంత్రిమండలి..ప్రయాణాలకు వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధన నుంచి ఏయే కేటగిరి వారికి మినహాయింపు ఇవ్వాలనే దానిపై పలు నిర్ణయాలు తీసుకుంది.కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ చేసిన పలు సిఫార్సులను ఈ సమావేశంలో మంత్రిమండలి సమీక్షించింది. వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొనబడని వయసు వారికి వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వనున్నట్లు కేబినెట్ వెల్లడించింది.అలాగే ఆరోగ్య కారణాల రిత్యా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులైన వారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి సర్టిఫికెట్ పొందిన పౌరులకు మాత్రమే వ్యాక్సిన్ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.మిగిలిన కేటగిరి పౌరులు అందరికీ వ్యాక్సిన్ డోసులు పూర్తైన తర్వాతే అంతర్జాతీయ ప్రయాణాలకు, దేశంలోకి రీఎంట్రీకి అనుమతించనున్నట్లు మంత్రిమండలి స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి మంత్రిమండలి నిర్ణయాలు అమలులోకి రానున్నాయి. ఇదిలాఉంటే దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకుంటున్న కువైట్..ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను కూడా తిరిగి సాధారణ స్థితిలో కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఆగస్ట్ 15 నాటికి అన్ని ప్రభుత్వ సంస్థలలో వర్క్ సిస్టమ్ సాధారణంగా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







