ప్రవాసీయులకు గుడ్ న్యూస్..రెడ్ లిస్ట్ దేశాల వారికి కూడా అనుమతి
- August 07, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రిటర్న్ కావాలనుకుంటున్న ప్రవాసీయులకు గుడ్ న్యూస్. ఇక నుంచి రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో ఉన్న వారు కూడా ఆయా దేశాల నుంచి నేరుగా బహ్రెయిన్ చేరుకోవచ్చు. బహ్రెయిన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అదే సమయంలో పర్యాటకులకు, ఇతర ప్రయాణికులకు మాత్రం మూడో దేశం మీదుగా కూడా ఎంట్రీకి అనుమతి ఉండదని వెల్లడించింది. తాజా పరిస్థితులపై సమీక్షించిన కమిటీ..రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో కొత్తగా జార్జియా, ఉక్రెయిన్, మలావీలను కూడా చేర్చింది. కోవిడ్ ను ఎదుర్కోనేందుకు ఏర్పాటైన నేషనల్ టాస్క్‌ఫోర్స్ సిఫార్సుల ఆధారంగా ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఈ నిర్ణయానికి వచ్చింది. కొత్తగా యాడ్ అయిన దేశాలతో పాటు బహ్రెయిన్ రెడ్ లిస్టులో ఇప్పటికే బంగ్లాదేశ్, డొమినికన్ రిపబ్లిక్, జార్జియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, మలేషియా, మెక్సికో, మంగోలియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, ట్యునీషియా ఉన్నాయి. అయితే..ఆయా రెడ్ లిస్ట్ దేశాల నుంచి పౌరులు, ప్రవాసీయుల రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బహ్రెయిన్..ప్రయాణికులు తమ ప్రయాణానికి 48 గంటల్లోపు తీసుకున్న పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్(క్యూఆర్ కోడ్ కలిగిఉండాలి) సమర్పించాల్సి ఉంటుంది. బహ్రెయిన్ చేరుకోగానే క్వారంటైన్లో ఉండి..10వ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ ఫీజును దేశంలోకి చేరుకోగానే చెల్లించవచ్చు. లేదంటే బీవేర్ బహ్రెయిన్ యాప్ ద్వారా చెల్లించవచ్చు. పౌరులు, ప్రవాసీయులకు బహ్రెయిన్‌లో పర్మినెంట్ అడ్రస్ ఉన్నట్లైతే హోమ్ క్వారంటైన్ కు అనుమతిస్తారు. పర్మినెంట్ అడ్రస్ లేని వారు నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ లైసెన్స్ పొందిన క్వారంటైన్ సెంటర్లో ఉండాల్సి ఉంటుంది. ఇది కేవలం బహ్రెయిన్ పౌరులు, ప్రవాసీయులకు మాత్రమే వర్తిస్తుంది. పర్యాటకులు, ఇతర ప్రయాణికులకు ఏ విధంగానూ ఎంట్రీ ఉండదు. అలాగే ఆరేళ్లలోపు పిల్లలకు ఎలాంటి నిబంధనలు వర్తించవు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్‌కోచ్‌లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









