హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ లో SIIMA అవార్డ్స్
- August 07, 2021
హైదరాబాద్: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - సైమా.. ఈ పేరు వింటే వచ్చే కిక్కే వేరప్ప. సౌత్ సినీ పరిశ్రమకు చెందిన తారలంతా ఒకే వేదికపైకి వచ్చి చేసే ఆ సందడి వేరే లెవల్లో ఉంటుంది. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్ డ్రెస్లలో స్టేజీపై హొయలు పోతుంటే ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. అలాంటి వేడుక గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే ఈ ఏడాది కూడా సైమా ఉండదేమోనని సినీ ప్రియులు భావిస్తున్న సమయంలో గుడ్న్యూస్ చెప్పింది సైమా. 2021 అవార్డుల వేడుకకు సంబంధించి తేదీ, వేదిక ఖరారు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.మీ నిరీక్షణకు తెరపడింది. సైమా అవార్డ్స్ వేడుకలు తిరిగి వచ్చాయి. సెప్టెంబరు 11, 12న సినిమా పండుగ జరుపుకుందాం అంటూ సైమా పేర్కొంది. హైదరాబాద్ వేదికగా సైమా అవార్డ్స్ వేడుక జరగనున్నట్టు ప్రకటించింది. 2012లో ఈ అవార్డుల కార్యక్రమం మొదలుకాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పటివరకు 8 సార్లు అట్టహాసంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. కానీ ఆ కార్యక్రమాలన్నీ విదేశాల్లోనే జరిగాయి. ఇప్పుడు తొలిసారి హైదరాబాద్ వేదికగా సైమా అవార్డ్స్ వేడుక జరగనుంది. మరి ఎవరెవరిని అవార్డులు వరిస్తాయో తెలియాలంటే మరొకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్









