నేడు తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవల టిక్కెట్లు విడుదల

- August 07, 2021 , by Maagulf
నేడు తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవల టిక్కెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది.వర్చువల్‌ ఆర్జిత సేవలను బుక్‌ చేసుకున్న భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 17, 18, 19, 20వ తేదీలతోపాటు 30, 31వ తేదీలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను https://tirupatibalaji.ap.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా విడుదల చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com