జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం
- August 07, 2021
న్యూఢిల్లీ: కరోనాను అంతమొందించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అత్యవసర వినియోగానికి మరో వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఆమోదం తెలిపింది. ఇది సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ' భారత్ తన వ్యాక్సిన్ బాస్కెట్‌ను విస్తరిస్తోంది. భారత్‌లో అత్యవసర వినియోగానికి జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు కోవిడ్-19 టీకా ఆమోదించాం. ప్రస్తుతం దేశంలో దేశంలో ఐదు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి ఆమోదించాం. కరోనాపై పోరు సాగిస్తున్న భారత్‌కు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది' అని ట్వీట్ చేశారు. అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న రెండు రోజులకు జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఆమోదం లభించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







