ఖాదీ అభివృద్ధికి కేంద్రం కృషి:కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- August 07, 2021
శ్రీకాకుళం: దేశంలోని ఖాదీ పరిశ్రమను ప్రోత్సాహించి చేనేత కార్మికులు ఆర్ధికంగా నిలదొక్కుకొనేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందులో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినట్లు చెప్పారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా పొందూరులోని ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆమె డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
తొలుత నూలు వడుకు యంత్రాలను పరిశీలించి, వివరాలను నేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కార్మిక సంఘ భవనం ఆవరణలో నూతనంగా నిర్మించనున్న ఖాదీ కార్మికుల సామూహిక షెడ్ కు ఆమె శంకుస్థాపన చేశారు. తదుపరి నేత కార్మికులు మర యంత్రాలు ద్వారా వస్త్రాలను రూపొందిస్తున్న విధానాన్ని పరిశీలించిన ఆమె వస్త్రాల తయారీకి సంభందించిన పూర్తి వివరాలు ఆమె అడిగి తెలుసుకున్నారు.అక్కడే ఏర్పాటుచేసిన వస్త్ర ప్రదర్శనను తిలకించి, ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను దూరం చేసి, వారిని ఆర్ధికంగా ఎదిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.దేశవ్యాప్తంగా చేనేత మెగా క్లస్టర్లను ఏర్పాటుచేసి వారిని ప్రోత్సహించేలా కార్యక్రమాలను రూపొందించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలోని పొందూరు ఖాదీకి ప్రత్యేకత ఉందని, అయితే ఇక్కడ మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు కాకపోవడానికి నేత కార్మికుల సంఖ్య తగ్గడమే అని చెప్పారు. కావున ఆ సంఖ్యను పెంచుకొని మెగా క్లస్టర్లను ఏర్పాటుచేసుకోవాలని ఆమె కార్మికులకు పిలుపునిచ్చారు.తొలుత ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘానికి రూ.18 లక్షల చెక్కును ఆమె అందించారు. అలాగే భవన నిర్మాణానికి చెందిన ధ్రువీకరణ పత్రాలను ఆమె సంఘ ప్రతినిధులకు అందజేశారు.
ఈ పర్యటన కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జి.వి.ఎల్.నరసింహా రావు,ఉత్తరాంధ్ర శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్, దువ్వాడ శ్రీనివాస్,ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, వీవర్స్ సెల్ రాష్ట్ర సభ్యులు బండారు జై ప్రతాప్ కుమార్,కేంద్ర అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్,ఖాదీ గ్రామ పరిశ్రమ కమీషన్ ఆర్ధిక సలహాదారు ఆషిమా గుప్త,జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, ఎస్.పి అమిత్ బర్దార్,టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, ఖాదీ పరిశ్రమ సంచాలకులు ఎస్.రఘు, సౌత్ జోన్ డిప్యూటీ సి.ఇ. ఓ ఆర్.ఎస్.పాండే,బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు జి.కె.ప్రసాదరావు, కార్యదర్శి దండ వెంకటరమణ, గ్రామ సర్పంచ్ రేగిడి లక్ష్మి,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..









