దుబాయ్ లో ఘ‌నంగా జ‌య‌శంక‌ర్ జ‌యంతి వేడుక‌లు

- August 07, 2021 , by Maagulf
దుబాయ్ లో ఘ‌నంగా జ‌య‌శంక‌ర్ జ‌యంతి వేడుక‌లు

దుబాయ్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం  దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంపులో ఘనంగా జరిగాయి.జయశంకర్ చిత్ర పటానికి TPCC గల్ఫ్ NRI cell అధ్యక్షులు ఎస్.వి.రెడ్డి మరియు కార్మికులు పూలమాల వేసి నివాళులర్పించారు.
 ఎస్.వి.రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జ‌య‌శంక‌ర్ త‌న జీవితాంతం క‌ష్ట‌పడ్డార‌ని పేర్కొన్నారు. తెలంగాణ భావ‌జాల వ్యాప్తికి నిరంత‌రం కృషి చేశార‌ని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ లో దళిత బందు ప్రకటించినట్టు గానే గల్ఫ్ కార్మీకుల కోసం గల్ఫ్ బంధు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో వరాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com