విరించి వర్మ దర్శకత్వంలో నాని...
- March 12, 2016
ఉయ్యాల జంపాల సినిమాతో మంచి విజయం సాధించిన యువ దర్శకుడు విరించి వర్మ. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించినా.. తరువాత అవకాశాలు పొందటంలో మాత్రం ఈ యువ దర్శకుడు వెనకపడ్డాడు. తొలి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వర్మ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నయంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలతో సూపర్ ఫాంలో ఉన్న నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విరించి వర్మతో కలిసి పనిచేయడానికి అంగీకరించాడు నాని. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్న వర్మ, నటీనటులు ఎంపిక కూడా మొదలు పెట్టాడు.
త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









