ఓనర్ల పేర్లతో వెహికిల్ నంబర్ ప్లెట్లు ఇవ్వట్లేదు..దుబాయ్ క్లారిటీ
- August 09, 2021
దుబాయ్: వాహన యజమానుల పేరు మీద నంబర్ ప్లేట్లు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ ఆర్టీఏ కొట్టి పారేసింది. నంబర్ ప్లేట్ల జారీ విషయంలో తాము ఎలాంటి కొత్త విధానాలను ప్రకటించలేదని స్పష్టం చేసింది. '7AMAD' అంటూ ఓనర్ పేరుతో దుబాయ్ ఆర్టీఏ నంబర్ ప్లేట్ జారీ చేసిందంటూ ఓ వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్లో ఓ నంబర్ ప్లేటును పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయ్యింది. దీంతో కొత్త నంబర్ ప్లేట్ పాలసీపై విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై వివరణ ఇచ్చిన దుబాయ్ ఆర్టీఏ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. తాము పేర్లతో కూడిన నంబర్ ప్లేట్లను జారీ చేయలేదని..సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నంబర్ ప్లేటు అధికారికంగా జారీ చేసింది కాదు అని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







