హాకీ గోల్ కీపర్ శ్రీజేష్‌కు యూఏఈ వ్యాపారవేత్త భారీ నజరానా
- August 09, 2021
యూఏఈ: యూఏఈకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ షంషీర్ వయలీల్.. భారత హాకీ జట్టు గోల్ కీపర్ శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించారు. 5,00,000 దిర్హాముల నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.భారత్ కాంస్య పతకం గెలవడంలో ముఖ్య భూమిక పోషించిన శ్రీజేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
కాగా..టోక్యో వేదికగా కాంస్య పతకం కోసం జర్మనీ జట్టుతో జరిగిన పోరులో భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. ఓ దశలో 1-3తో వెనుకడినా తర్వాత పుంజుకుంది. 5-4 స్కోరుతో విజయాన్ని కళ్లముందుంచింది. కానీ చివరి ఆరు సెకన్లలో ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్ లభించిన వేళ.. గోల్ కీపర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించారు.ప్రత్యర్థి జట్టు గోల్ చేయకుండా గోడలా నిలబటంతో 41 ఏళ్ల తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన విషయం తెలిసిందే
తాజా వార్తలు
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్









