భారత్ విమానాల పై నిషేధం పొడిగింపు
- August 10, 2021
కెనడా: భారత్‌లో మూడో వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయని వస్తున్న వార్తల మధ్య కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల దృష్ట్యా, భారత్ నుంచి వచ్చే ప్రయాణీకుల విమానాలపై నిషేధాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని సెప్టెంబర్ 21వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఈమేరకు సమాచారాన్ని ఇచ్చింది.
ఇంతకుముందు ఆగస్టు 21వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉండగా.. అది ఇప్పుడు సెప్టెంబర్ 21 వరకు పొడిగించారు. వాస్తవానికి, కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో డెల్టా వేరియంట్ల దృష్ట్యా, కెనడియన్ ప్రభుత్వం, ఏప్రిల్ 22న మొదటిసారి భారత్‌పై నిషేధం విధించింది. లేటెస్ట్గా సెప్టెంబర్ 21 వరకు ఈ నిషేధాన్ని పొడిగించబడింది. ప్రజారోగ్య ప్రాధాన్యం మేరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అంతేకాదు.. భారతదేశం నుంచి కెనడాకు థర్డ్ కంట్రీ ప్రీ-డిపార్చర్ ద్వారా వెళ్లే ప్రయాణీకులకు కెనడా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ప్రయాణీకులకు కోవిడ్ నెగటివ్ RT-PCR పరీక్షలు అవసరం అని చెప్పారు. క్వారంటైన్ కంపల్సరీ అని స్పష్టం చేసింది. అదే సమయంలో, సెప్టెంబర్ నెలకి కరోనా పరిస్థితి మెరుగుపడితే, సెప్టెంబర్ 7 నుంచి పూర్తిగా టీకాలు వేయించుకున్న ప్రయాణికులకు సరిహద్దులను తెరుస్తామని ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







